తలపతి అభిమానులకు పండుగే..సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్న మేకర్స్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ నటించిన చిత్రాలు తెలుగు నాట కూడా విడుదలవుతున్నాయి. ‘తుపాకి’ చిత్రం నుంచి తెలుగులో విజయ్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇటీవల ‘బీస్ట్’ ఫిల్మ్ కూడా తెలుగులో విడుదలైంది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 66వ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘మహర్షి’ ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తలపతి 66’ పిక్చర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది. కాగా, ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది.

ఈ చిత్రం నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న క్రమంలో మేకర్స్ సర్ ప్రైజ్ గా అప్ డేట్ ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నెల 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు నటుడు ప్రభు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ట్వీట్ చేశారు. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version