ఖర్బూజ సాగులో మేలైన విత్తన రకాలు.. తెగుళ్ల నివారణ..!

-

వేసవిలో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న పండ్లు తినడానికే జనాలు ఇష్టపడతారు. అలాంటివాటిల్లో.. పుచ్చకాయ తర్వాత..ఖర్బూజానే ఉంటుంది. ఇది తినడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గేయొచ్చు. మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌గా ఖర్బూజా ముక్కలను తింటే… మీకే తెలియకుండా మీ బాడీలో ఫ్యాట్‌ అంతా తగ్గిపోతూ వస్తుంది. ఈ పంటను పండించటం వల్ల మంచి లాభాలు కూడా పొందవచ్చు. ఈరోజు మనం ఈ పంటసాగుకు మేలైన విత్తన రకాలు, తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు చూద్దామా.!
ఖర్భూజా పంటలో అనేక రకాలను ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో అర్క జీత్, అర్క రాజహాన్స్, దుర్గాపుర మధు, హరా మధు, పంజాబ్ హైబ్రిడ్, పూస మధురస్, పూస రస్ రాజ్.
ప్రైవేట్ రకాలు: ఎన్. ఎస్. 910, ఎన్. ఎస్. 7455, సన్-2, సూర్య, సూరజ్, కుందన్, గోల్డెన్ గ్లోరీ, గాయత్రి, కాంచన్, కోహినూర్ మొదలైనవి సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తన మోతాదుకు సంబంధించి సూటి రకాలు 500-600 గ్రాములు ఎకరాకు హైబ్రిడ్ రకాలు 300 గ్రాములు ఎకరాకు సరిపోతాయి.
కాయలు పక్వ దశకు వచ్చే సమయంలో మార్కెట్ సదుపాయాన్ని చూసుకోని కోయాలి. సాధారణంగా మర్కెట్ దూరంగా వున్న ప్రదేశాలకు తరిలించాలనుకుంటే కాయలు సగం పక్వ దశకు రాగానే పంట కోసి తరలించుకోవాలి. ఈ సమయంలో కాయలు పక్వము చెంది, నాణ్యత బాగుంటుంది. పూర్తి పక్వము చెందిన కాయలలో చక్కెర శతం ఎక్కువుగా ఉంటుంది.

తెగుళ్లు..

మొజాయిక్ తెగులు: మొజాయిక్ లక్షణాలు మొదట లేత ఆకులపై కనిపిస్తాయి. క్రమేపి ఈ ఆకులు క్రిందకు ముడుచుకొని, ఆకారంగా కోల్పోయి, గరుకుగా, పరమాణం తగ్గి కనిపిస్తాయి. మొక్కల కణుపులు దగ్గరగా అవటం వలన తీగ సరిగ్గా సాగకుండా లేత ఆకులు గులాబి పూవ్వు మాదిరిగా ఒక్క చోటనే అంటిపెట్టుకొని ఉంటాయి. కాయలు తరచు ఆకారం కోల్పోయి బొబ్బలతో కన్పిస్తాయి.
బూడిద తెగులు: ఇది పొడి వాతావరణ కాలాల్లో ఎక్కువగాను తేమతో కూడిన వాతావరణంలో తక్కువగాను వ్యాపిస్తుంది. ప్రధానంగా ఆకుల పై భాగంలో తెల్లని బూడిద వంటి శిలీంద్రం పెరుగుతుంది. కాని కొన్ని సందర్భాలలో ఆకు అడుగున కాండంపై కూడా కనిపిస్తుంది. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగుకు మారి వడలిపోతాయి. ఆకులు, కాండం ఎండిపోవడం వలన తీగ సాగదు, కాయలు తక్కువగా, చిన్నవిగా అవుతాయి..
నివారణకు.. దోస జాతి సంబంధమైన అడవి మొక్కలను దగ్గరలో పెరగకుండ పీకి వేయాలి. పంట అవశేషాలను తగుల బెట్టాల్సి ఉంటుంది..ట్రైడిమార్ఫ్ 1 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్ 0.1 గ్రా. లేదా మైక్లోబుటానిల్ 1 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 1 గ్రా. లేదా డైఫెనకొనజోల్ 0.5 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు.
పండు ఈగలు: ఈ పండు ఈగలు దోసజాతి కూరగాయలకు ఆశిస్తాయి. లార్వాలు కాయలలో గజ్జుని తిని కలుషితం చేస్తాయి. ఈ దశలో తల్లిపురుగులు గ్రుడ్లను పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా రసం కారుతుంది. ఈ రంధ్రాల ద్వారా శిలీంధ్రము, బాక్టీరియా ప్రవేశించి కాయ కుళ్ళటమే కాక కాయలు ఎదగకుండా.. ఆకారం కోల్పోయి చివరిగా రాలిపోతాయి.
ఖర్భూజా నాటిన తరువాత కలుపుకు నియంత్రణ చర్యలు చేపట్టాలి. లేకపోతే దాని ప్రభావం దిగుబడిపై విపరీతంగా పడుతుంది. కలుపు ద్వారా వచ్చే చీడపీడలు పంటను ఆశించకుండా చూసుకోవచ్చు. కర్భూజ సాధారణంగా 30 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, పొడి వాతావరణంలో పండించ గలిగే స్వల్ప కాలిక వాణిజ్య పంట. సాధారణంగా 27-30 డిగ్రీల ఉష్ణోగ్రతలో విత్తన మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. పూత సమయంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే పిందెలు తక్కువగా ఏర్పడుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version