సంచలనం; ఎన్నికల్లో విపక్షాల ఫోన్లు ట్యాప్, మాకేం తెలీదు…!

-

ఎన్నికల సమయంలో ఎన్‌సిపి, శివసేన నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. ఫోన్లను ట్యాప్ చేయడం మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిలో భాగం కాదని ఫడ్నవీస్ స్పష్టం చేసారు. “ఫోన్ ట్యాప్ చేయడం మహారాష్ట్ర రాజకీయ సంస్కృతి కాదు.

మరియు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఫిర్యాదు చేసిన వారి గురించి, వారు ఎంత నమ్మకస్తులో అందరికి తెలిసిందే అంటూ ఫద్నవీస్ ఆరోపణలు చేసారు. “అయితే ప్రభుత్వం దర్యాప్తు చేయాలనుకుంటే వారికి స్వేచ్చ ఉంది. మహారాష్ట్ర ప్రజలకు నిజం తెలుసు. శివసేనకు హోం మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రి ఉన్నారు. వారు దర్యాప్తు చేయమని నేను మాత్రమే అభ్యర్థించగలను త్వరగా, ఆ నివేదికను బహిరంగపరచండి.

అవసరమైతే, వారు ఇజ్రాయెల్‌కు వెళ్లి దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంపి సంజయ్ రౌత్ ఫోన్‌లను గత బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ట్యాప్ చేసిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ముంబైలో విలేకరులతో మాట్లాడిన మంత్రి, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ఫోన్ ట్యాప్ చేయడం, స్నూప్ చేయడం వంటి ఫిర్యాదులను పరిశీలించాలని రాష్ట్ర పోలీసు శాఖ సైబర్ సెల్ ను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version