ప్రభుత్వం నుండి ప్రజలకు చేరవేసే విషయంలో అప్పట్లో పత్రికారంగం చాలా కీలకంగా ఉండేది. అయితే రాను రాను టెక్నాలజీ పెరగటం ఎలక్ట్రానిక్ మీడియా రావటం తో పాటుగా ఇప్పుడు సోషల్ మీడియాలో రావటంతో పత్రికారంగం డేంజర్ జోన్ లో పడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. పత్రికా రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు యాజమాన్యాలు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదట. దీంతో చాలా వరకు పత్రికలు మూత పడటానికి రెడీ అయ్యాయి.
దీంతో ప్రస్తుతం పత్రికారంగం మొత్తమంతా మూత పడటానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో పత్రిక రంగాన్నే నమ్ముకున్న యాజమాన్యాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మా మొర వినే ప్రభుత్వాలు కూడా లేవు అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మరికొన్ని పత్రికలు అయితే పార్టీల ఫేవర్ గా ఉంటూ నెట్టుకొచ్చేస్తున్నాయి. దీంతో ఉన్నది ఉన్నట్టు చూపించే పత్రికల పరిస్థితి ఇప్పుడు చాలా ప్రమాదకర స్థితిలో పడింది.