పాక్ ప్ర‌ధాని నిర్లక్ష్యం.. ప్ర‌జ‌ల మూర్ఖ‌త్వం.. కరోనా క‌ట్ట‌డిలో వైఫ‌ల్యం..!

-

ప్ర‌పంచ‌మంతా ఓ వైపు క‌రోనాకు భ‌య‌ప‌డి లాక్‌డౌన్‌ను క‌ఠినంగా పాటిస్తుంటే.. మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఇంకా మూర్ఖ‌పు పంథానే అవ‌లంబిస్తోంది. ఆ దేశంలో క‌రోనా రోగుల సంఖ్య రోజు రోజుకీ తీవ్రంగా పెరిగిపోతోంది. అయిన‌ప్ప‌టికీ పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ మాత్రం ఇంకా మేల్కొన‌లేదు. ఇప్ప‌టికే అక్క‌డ 2238 వ‌ర‌కు క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 31 మంది చ‌నిపోయారు. అయిన‌ప్ప‌టికీ పాక్ ఇంకా క‌రోనాకు భ‌య‌ప‌డ‌డం లేదు. పైగా వారు ఇంకా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

మ‌న దేశంలో లాక్‌డౌన్ అమ‌లులోకి వ‌చ్చిన‌ప్పుడు పెద్ద‌గా క‌రోనా కేసులు లేవు. మ‌న ద‌గ్గ‌ర ప‌రిస్థితి అంత తీవ్రంగానూ లేదు. కానీ పాక్‌లో మాత్రం ఇప్పుడు ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. అక్క‌డ క‌రోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయినా ప్ర‌జ‌లు రోడ్ల‌పై గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు. మ‌న దేశంలో అన్ని మ‌తాల‌కు చెందిన ఆల‌యాలు, ప్రార్థ‌నా మందిరాలు, ఇత‌ర ప్ర‌దేశాలు మూత ప‌డ్డాయి. కానీ పాక్‌లో ఇంకా వాటిని మూసేయ‌లేదు. ఇప్ప‌టికీ శుక్ర‌వారం అనేక మ‌సీదుల‌ను ఓపెన్ చేస్తూనే ఉన్నారు. జ‌నాలు ప్రార్థ‌న‌ల‌కు వ‌స్తూనే ఉన్నారు. సోష‌ల్ డిస్టెన్స్ అనే మాట‌నే అక్క‌డ జ‌నాలు మ‌రిచిపోయారు.

ఇక పాక్‌లో ప్ర‌ధాని ఇమ్రాన్ ఇంకా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించ‌లేదు. కానీ జ‌నాల‌కు బ‌య‌ట తిర‌గ‌వ‌ద్ద‌ని.. ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని అక్క‌డి అధికారులు సూచిస్తున్నారు. పోలీసులైతే.. బాబ్బాబూ.. మీకు దండం పెడ‌తాం.. ఇళ్ల‌లోనే ఉండండి.. బ‌య‌ట‌కు రాకండి.. అని కాళ్లూ, గ‌డ్డాలు ప‌ట్టుకుని బ‌తిమాలుతున్నా.. జ‌నాలు విన‌డం లేద‌ట‌. దీంతో అక్క‌డి మేథావులు, నిపుణులు ఇమ్రాన్‌ను త‌ప్పుబ‌డుతున్నారు. అయితే ఎవ‌రికైనా.. స‌రే.. పీక‌ల‌దాకా క‌ష్టం వ‌స్తే గానీ.. దాని ప్ర‌భావం తెలియ‌ద‌ని.. ఇప్పుడు ఇమ్రాన్‌కు కూడా అంత స్థితి రాలేదు. కానీ.. ముందు ముందు ప‌రిస్థితి చేయి దాటితే.. అప్పుడు ఇక ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. అది వృథా ప్ర‌యాసే అవుతుంది. ప్ర‌స్తుతం అమెరికా స‌హా.. యురోపియ‌న్ దేశాలు కూడా స‌రిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నాయి. ముందు ఆయా దేశాలు క‌రోనాను ప‌ట్టించుకోలేదు.. లైట్ తీసుకున్నాయి.. కానీ ఇప్పుడు ప‌రిస్థితి చేయి దాటింది. దీంతో ఇప్పుడా దేశాలు క‌ష్టాల‌ను అనుభ‌విస్తున్నాయి. అయితే ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆ ఒక్క మ‌ర్క‌జ్ ఘ‌ట‌న లేక‌పోతే.. ప‌రిస్థితి ఇప్పుడు చాలా సంతృప్తిక‌రంగా ఉండేది. మ‌రి ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డుతాయో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version