సంచలనం; నిజమే 7 కిలోమీటర్ల కేకు ఇది…!

-

కేరళలో సంచలనం సృష్టించారు బేకర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేక్ ని తయారు చేసారు. ఒక అడుగు కాదు రెండు అడుగులు కాదు… ఏకంగా నాలుగు మైళ్ళు కేకుని తయారు చేసారు నిర్వాహకులు. అంటే దాదాపు 6.5 కిలోమీటర్ల కేకు అన్నమాట. వందలాది మంది బేకర్లు దీని తయారి కోసం తీవ్రంగా శ్రమించారు. బుధవారం దీని తయారి చేపట్టి వాళ్ళు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

కేరళలోని త్రిస్సూర్‌లోని ఒక మైదానంలో, మైదానం పక్క రోడ్ల వద్ద వేలాది టేబుల్స్ మరియు డెస్క్‌లపై చాక్లెట్ ని విస్తరించారు. సుమారు 1,500 మంది బేకర్లు మరియు చెఫ్‌లు 12,000 కిలోగ్రాముల చక్కెర మరియు పిండిని ఉపయోగించి దాదాపు నాలుగు గంటల పాటు తయారు చేసారు. బేకర్స్ అసోసియేషన్ కేరళ (బేక్) నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం వీక్షించారు.

ఈ కేక్ 6,500 మీటర్లు అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంచనా వేసినప్పటికీ, ఖచ్చితమైన పొడవు గురించి వారి నిర్ధారణ కాలేదని గ్రూప్ సెక్రటరీ జనరల్ నౌషాద్ తెలిపారు. 2018 లో జిక్సీ కౌంటీలో చైనీస్ రొట్టె తయారీదారులు నెలకొల్పిన 3.2 కిలోమీటర్ల పొడవున ఫ్రూట్‌కేక్ గిన్నిస్ రికార్డును అధిగమించారు. పరిశుభ్రత పాటిస్తూ, రుచిని దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేసారు నిర్వాహకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version