WORLD CUP 2023: నెదర్లాండ్ పై 99 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం…!

-

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం లో న్యూజిలాండ్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో టామ్ లాతమ్ సేన 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి నెదర్లాండ్ ముందు కష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది. అందుకు తగినట్లు గానే నెదర్లాండ్ 46.3 ఓవర్ లపాటు బ్యాటింగ్ చేసి 223 పరుగులకు ఆల్ ఔట్ అయింది. నెదర్లాండ్ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా సరైన సమయంలో నిలకడ లేకుండా ఆడి ఓటమిని కొనితెచ్చుకుంటున్నారు. భారీ లక్ష్య చేదనలో ఓపెనర్లు విక్రమ్ జీత సింగ్ మరియు మాక్స్ ఓ డౌడ్ లు సరైన ఆరంభాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.. యకర్ మాన్ ఒక్కడే అర్థ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఎడ్వర్డ్, డి లీడ్, తేజ లు విఫలం అయ్యారు.

కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మిచెల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకోగా, ఇతనికి హెంటీ మూడు వికెట్లు చక్కని సహకారం ఇచ్చాడు. ఫైనల్ గా న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్ ను ఓడించి సెమీస్ కు దగ్గరగా వెళుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version