వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియాను ఓడించి కప్ కొట్టేస్తాం : అండర్సన్

-

ఇండియా వేదికగా జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా కప్ కోసం మొత్తం పది జట్లు అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నాయి. అక్టోబర్ వ తేదీ నుండి మ్యాచ్ లు ప్రారంభము కాగా నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ తో వరల్డ్ కప్ ముగుస్తుంది. ఇక తాజాగా మాజీ ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ షో లో మాట్లాడుతూ వరల్డ్ కప్ గురించి ఒక వాస్తవాన్ని చెప్పడం జరిగింది. ఈ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకునే జట్లలో ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు ఉంటాయని జోస్యం చెప్పాడు.. .ఇక పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లకు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సెమీస్ చేరకుండానే ఇంటి దారి పడతాయని చెప్పాడు అండర్సన్. సెమిఫైన లో ఇండియా మరియు ఇంగ్లాండ్ లు గెలిచి తుది పోరుకు అర్హత సాధిస్తాయని..

కానీ చివరికి టైటిల్ పోరులో మాత్రం ఇండియాను ఇంగ్లాండ్ ఓడించి కప్ ను మరోసారి వర్సగా గెలుచుకుంటుందని జోస్యం చెప్పాడు అండర్సన్. మరి ఇంగ్లాండ్ ఆటతీరు అండర్సన్ చెప్పేలాగా ఉందా? మొదటి మ్యాచ్ లోనే అన్ని విభాగాలలో ఫెయిల్ అయ్యి ఓటమి పాలయింది. మరి చూద్దాం ముందు మ్యాచ్ లలో అయినా ఆకట్టుకుంటుందా ?

Read more RELATED
Recommended to you

Exit mobile version