కివీస్ వరల్డ్ కప్ జట్టు విడుదల… యంగ్ ప్లేయర్ “ఫిన్ అలెన్” కు షాక్!

-

ఈ రోజు ఉదయమే వన్ డే వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టును న్యూజిలాండ్ జట్టు ప్రకటించింది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించగా, తాజాగా కివీస్ జట్టు యాజమాన్యం ఈ శుభవార్తను తెలిపింది. ఇక ఈ జట్టుకు కెప్టెన్ గా సీనియర్ ప్లేయర్ కెన్ విలియమ్సన్ ను ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు విలియమ్సన్ ఫిట్ గా ఉంటాడా అన్న విషయాన్ని ప్రకటించకపోవడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టీం ఇందులో ఇప్పటి వరకు చేసిన ప్రదర్శన ఆధారంగానే జట్టును ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ జట్టులో టీ 20లలో రెగ్యులర్ ప్లేయర్ గా ఉన్న ఫిన్ అలెన్ కు చోటు కల్పించలేదు. ఇతనికి బదులుగా రైట్ హ్యాండ్ ఓపెనింగ్ ప్లేయర్ విల్ యంగ్ మీదనే నమ్మకం పెట్టుకోవడం విశేషం.

ఇక జట్టు పూర్తి వివరాలకు వస్తే, విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాతమ్ (కీపర్), యంగ్, కాన్ వే, మిచెల్, మార్క్ చాప్ మాన్, ఫిలిప్స్, నీషం, రవీంద్ర, బౌల్ట్, సౌథీ, హెన్రీ, సోధీ, శాంట్ నర్ మరియు ఫెర్గుసన్ లు ఉన్నారు. ఇక ఒకవేళ విలియమ్సన్ గాయం కారణంగా దూరమైతే లాతమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version