భారత్‌కు షాక్… రెండు వారాల పాటు రాకపోకల బంద్

-

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెల్సిందే. గడిచిన 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు బయటపడడం మన దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ దేశం భారత్‌కు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఇండియా నుంచి వెళ్ళే ప్రయాణికులను తమ దేశంలోకి రానివ్వకుండా తాత్కాలిక నిషేధం విధించింది.

ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది. కాగా భారత్‌ నుంచి న్యూజిలాండ్‌ వెళ్ళాలనుకునే ఆ దేశ పౌరులపై కూడా ఈ తాత్కాలిక నిషేధం ఉంటుందని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ స్పష్టం చేసారు. అయితే న్యూజిలాండ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏప్రిల్‌ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే భారత్‌లో కరోనా తీవ్రత తగ్గకుంటే తాత్కాలిక నిషేధం మరింత కాలం పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఇటీవల విదేశాల నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించింది. ఇందులో 23 మందికి కరోనా పాజిటివ్ రాగా కాగా పాజిటివ్ వచ్చిన వారిలో 17 మంది భారత్‌ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో కరోనా కట్టడిలో భాగంగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా న్యూజిలాండ్‌లో గత 40 రోజులుగా ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు. అయితే తాజాగా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ముందే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version