ఇటీవల జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లక్ష్మీనారాయణ రాజీనామా పెద్ద హాట్ టాపిక్ అయింది. సరిగ్గా 2019 ఎన్నికల సమయం ముందు జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ ఎన్నికలలో పార్టీ తరపున పార్లమెంట్ కు పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఓడిపోవడం జరిగింది. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటూ వస్తున్న లక్ష్మీనారాయణ..ఇటీవల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయడంతో ఆ విషయం నచ్చక రాజీనామా చేస్తున్నట్లు లెటర్ రాసి రాజీనామా చేయడం జరిగింది.
దీంతో బిజెపి పార్టీలోకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ కి దెబ్బ మీద దెబ్బ రాజకీయంగా తగులుతున్న తరుణంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా బిజెపి మరియు జనసేన కలయికలను సపోర్ట్ చేయటంతో తాజాగా జనసేన పార్టీని లక్ష్మీనారాయణ వీడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ…ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటిచారని.. అలాంటప్పుడు పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు. దీంతో ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న తరుణంలో నెక్స్ట్ ఆ పార్టీ బిజెపి పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.