మీర్ పేట్ భార్య హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. మీర్పేట్ లోని న్యూ వెంకటేశ్వర నగర్ లో జరిగిన హత్య కేసులో భార్యను భర్త చంపినట్లు గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించి భార్యను గురుమూర్తి చంపినట్లుగా దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇక ఇవాళ గురుమూర్తిని కోర్టులో హాజరుపరచనున్నారు మీర్‌పేట్ పోలీసులు.
ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు మీర్పేట్ పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రికస్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే కీలకమైన ఆధారాలను సేకరించారు దర్యాప్తు అధికారులు. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించి కీలకమైన ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్.. ఇవాళ గురుమూర్తిని కోర్టులో హాజరుపరచనున్నారు.