తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఎన్ఐఏ దాడులు..

-

ఏపీ తెలంగాణలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏక కాలంలో దాడులు చేయడం కలకలం రేపుతోంది. విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల నేతల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్థొనిఉ. కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం మాజీ కార్యదర్శి వరలక్ష్మి, హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో అడ్వకేట్ రఘునాద్, డప్పు రమేష్ ఇళ్ళ మీద ఈ రైడ్స్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. సత్తెనపల్లికి చెందిన చిలకా చంద్రశేఖర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

విరసం పాణి, ప్రజా కళా మండలి కోటి సహా అమరుల బంధుమిత్రుల సంఘం అంజమ్మ ఇంట్లో సైతం ఈ సోదాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ దాడులను ప్రొఫెసర్ హరగోపాల్ ఖండించారు. హక్కుల నేతలను భయపెట్టేందుకే ఈ సోదాలు చేస్తున్నారని అన్నారు. ఇక ఈ కేసులోనే విరసం నేత వరవరరావు అరెస్ట్ అయ్యి చాలా రోజుల జైలు జీవితం కూడా గడిపిన సంగతి తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Exit mobile version