హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి ఐసీస్ కుట్ర.. ఛేదించిన పోలీసులు

-

హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుండటం కలకలం లేపుతోంది. నగరంలో ఉగ్ర కదలికలు పలు అనుమానాలను రేకిత్తిస్తున్నాయి. నగరంలో భారీ విధ్వంసం చేసేందుకు ఐసీస్ కుట్ర పన్నిందా? ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన మైలార్ దేవ్ పల్లిలో ఎనిమిది ఇళ్లల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు నిర్వహించి తాహిర్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నది. ఇదివరకు ఎన్ఐఏ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ అనే ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకే ఎన్ఐఏ హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తోంది.

బాసిత్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. అతడు ఐసీస్ లో చేరడం కోసం సిరియా, పాకిస్థాన్ కూడా వెళ్లొచ్చాడు. అక్కడ ట్రెయినింగ్ అనంతరం భారత్ కు తిరిగి వచ్చిన బాసిత్.. ఐసీస్ ఆదేశాలతో ఢిల్లీకి చెందిన ఆర్ఎస్ఎస్ నేతను అంతం చేయడానికి ప్లాన్ చేశాడు. మరో నలుగురు యువకులతో కలిసి ఢిల్లీలో మకాం వేసిన బాసిత్.. ఏకే 47తో ఆర్ఎస్ఎస్ నేతను అంతమొందిచాలని ప్లాన్ వేశారు. కానీ.. వాళ్ల కుట్రను ఎన్ఐఏ ఛేదించింది. అతడిని అరెస్ట్ చేసి విచారించగా.. పలు కీలక విషయాలు తెలిశాయి. బాసిత్, ఓ పాక్ యువతికి మధ్య సంబంధాలు ఉన్నాయని అతడి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. అతడితో ఆమె చేసిన చాటింగ్ ఆధారంగా తాహిర్ ను అదుపులోకి తీసుకొని అతడి ఇంట్లో పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version