నాన్న కేసీఆర్ కు కూతురు శ్రీరెడ్డి వ్రాయునది ఏమనగా… కేసీఆర్ కు శ్రీరెడ్డి లేఖ..!

-

శ్రీరెడ్డి తెలుసు కదా. ఆమె… తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలను ఎలా వాడుకుంటున్నారో.. ఆఫర్ల కోసం ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చే మహిళలను వాళ్లకు నచ్చిన విధంగా చేస్తేనే ఆఫర్లు ఇస్తున్నారంటూ ఆమె కేసీఆర్ కు మొర పెట్టుకున్నారు.

అయితే.. శ్రీరెడ్డి.. ఒక ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టుగా కాకుండా… సీఎంను నాన్న అని పిలుస్తూ… నాన్న గారికి ఉత్తరం రాస్తున్నట్టుగా రాశారు.

మధ్యమధ్యలోనూ నాన్నా.. అని మాత్రమే ఆమె పిలిచారు తప్పతే.. ఎక్కడా సీఎం పేరు ఉపయోగించలేదు.

నాన్నగారూ… ఈ మాటతో మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండు కుండలు అయిపోయాయి. ఈ మాట, పిలుపుకు దూరమై దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. మా నాన్న నాకు దేవుడు, చిన్నప్పటి నుంచి మేం ఏం కావాలన్నా… కాదు అనకుండా ఇచ్చేవారు. తండ్రీ అని పిలవగానే అందరూ ఇలాగే ఉంటారేమో భగవంతుడితో సహా.. అంటూ ఆమె తన లేఖను ప్రారంభించారు.

తన లేఖ మొత్తంలో కాస్టింగ్ కౌచ్ గురించే ప్రస్తావించారు శ్రీరెడ్డి. అమ్మాయిలను అవకాశాల పేరుతో ఎలా వేధిస్తున్నారో లేఖలో స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేకుండా చేయాలని… దాని కోసం ఏదో ఒకటి చేయాలని ఆమె సీఎంను వేడుకున్నారు.

ఈ లెటర్ కేసీఆర్ వరకు చేరాలని… ఆయన తమకు న్యాయం చేస్తారని.. ఇండస్ట్రీలో ఎంతో మంది రాక్షసుల పాలిట రుద్రుడై వాళ్ల తాట వలచి మార్పులు తీసుకువస్తారని నమ్ముతున్నానంటూ లేఖను ముగించారు శ్రీరెడ్డి.

ఆమె రాసిన లెటర్ పూర్తిగా కింద చదవండి…

Read more RELATED
Recommended to you

Exit mobile version