పెళ్లి పీటలెక్కనున్న ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌.. వరుడు ఎవరంటే ?

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌.. నిధి అగర్వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే.. నిధి అగర్వాల్‌ ప్రేమలో పడినట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తమిళ్‌ హీరో శింబు ప్రేమలో ఆమె ఉందని అందుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెబుతున్నారు.

ఈశ్వరన్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. గత ఏడాది జనవరి లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే.. ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కొంత కాలంలగా శింబు ఇంట్లోనే నిధి ఉంటోందనే ప్రచారం కూడా జరుగుతుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వీరు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తేలాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్‌ అవ్వాలి. మరోవైపు హీరో శింబు కు హీరోయిన్లతో ఎఫైర్‌ పెట్టుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించారు హీరో శింబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version