తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.. మే నెల ఒకటో తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ సమయం అమల్లో ఉంటుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
అత్యవసర సర్వీసులు తప్ప మిగతావన్నీ ఎనిమిది గంటల లోపు మూసివేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, ఈ కామర్స్, గూడ్స్ సర్వీసులు, పెట్రోల్ పంపులు ఎల్పీజీ గ్యాస్ అవుట్లెట్ , పవర్ జనరేషన్ – డిస్ట్రిబ్యూషన్, కోల్డ్ స్టోరేజ్, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించిన సముదాయాలు మామూలుగానే తమ పని తాము చేసుకోవచ్చు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.