సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం ట్రెండింగ్ లో ఉండటం కామనే. ఎందుకంటే ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో వైరల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇదే కోవలో ఓ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. స్టాప్ వాచింగ్ మూవీస్ పేరుతో ట్విట్టర్ లో ఈ రోజు ఉదయం ఓ ఉద్యమం ఊపందుకుంది. దీంట్లో అనేక రకాలైన విషయాలను నెటిజన్లు తెలపుతున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ సినిమాను చూడటం మానేయాలని ఇందులో ట్వీట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అన్ని షేమ్‌లెస్ సినిమాలు అని, వల్గర్ గా ఉంటున్నాయని హిందూ ప్రేరేపిత గ్రూప్ ల ద్వారా ఈ విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ హ్యాశ్ ట్యాగ్‌ను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్‌ల్ అన్ని ముస్లిం సినిమాలే వేస్తున్నారని, హిందూ దేవుళ్లను అవమానపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడటం మానేయాలని సంత్ రామ్ పాల్ జీ అనే ట్విట్టర్ ఐడీ ద్వారా మొదలైన ఈ ట్యాగ్‌లైన్ కొద్ది నిముషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చింది. టీనేజ్ పిల్లలు ఈ సినిమాలు చూసి చెడిపోతున్నారని పెద్దలు మండిపడుతున్నారు.
ఇక జస్టిస్ టు షుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయం ట్రెండింగ్ లోకి వచ్చిన రోజే ఈ విషయం కూడా వైరల్ అవడం విశేషం. కేవలం బాలీవుడ్‌నే టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కొవిడ్ ఎఫెక్ట్ తో ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ కుదేలయింది. ఇక ఇలాంటి నిరసనలతో సినీ పరిశ్రమ మరింత నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. చూడాలి మరి ఇది ఎటు దారి తీస్తుందో.