NIHలో ఉద్యోగాలు.. రెండు లక్షల జీతం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఉత్తరాఖండ్ లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. 18 సైంటిస్ట్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.

అక్టోబర్‌ 20, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోచ్చు. సైంటిస్ట్ ఎఫ్, సి, బి కేటగిరీలలో ఈ ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… సైంటిస్ట్ ఎఫ్ – 1 పోస్ట్, సైంటిస్ట్ సి – 6 పోస్టులు, సైంటిస్ట్ బి – 11 పోస్టులు వున్నాయి. వయస్సు వివరాల లోకి వెళితే.. సైంటిస్ట్ ఎఫ్ పోస్టుకి అభ్యర్థి గరిష్ట వయస్సు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అని నోటిఫికేషన్ లో చెప్పారు. సైంటిస్ట్ సి కి ఐటీబీ 40 సంవత్సరాలు, సైంటిస్ట్ బి కి అయితే 35 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. శాలరీ విషయానికి వస్తే.. ఎంపికైన వారికి నెలకు రూ.56,000 నుంచి రూ.2,16,600 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం http://nihroorkee.gov.in/ని సందర్శించవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసాక ఫారమ్ హార్డ్ కాపీని కింద చిరునామాకు పంపాలి.

సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, జల్ విజ్ఞాన్ భవన్, రూర్కీ, జిల్లా- హరిద్వార్ (ఉత్తరాఖండ్) – 247667

 

Read more RELATED
Recommended to you

Exit mobile version