నవీన్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన హరిహార కృష్ణ ప్రియురాలు !

-

 

నవీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపెట్టింది నిందితుడు హరిహార కృష్ణ ప్రియురాలు నిహారిక. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే హరిహర కృష్ణ మాకు సర్ది చెప్పేవాడని వివరించింది. ఇక నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడని తెలిపింది. నవీన్ నాతో మాట్లాడడం నచ్చని హరి హరికృష్ణ.. ఒకసారి.. నవీన్ ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని చెప్పాడని పేర్కొంది.

ఇక ఫిబ్రవరి 17 రోజున నవీన్‌ చంపేసి….మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని నాకు మెసేజ్ చేశాడని వివరించింది. శివ రాత్రి రోజున ఉదయం 9:30 కి.. వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిశానని…అప్పుడు హరి పాత బట్టలు వేసుకుని రాగా ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావని అడిగానని వెల్లడించింది. నవీన్ ను నేను రాత్రి చంపేశానని చెప్పాడని.. హసన్ కి కూడా నవీన్ హత్య విషయం చెప్పానని తనతో చెప్పినట్లు నిహారిక వివరించింది. ఆ తర్వాత హరి వరంగల్ వెళ్తాను డబ్బులు కావాలి అని అడిగితే నేను హరికి 1500 ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పినట్లు పేర్కొంది నిహారిక.

Read more RELATED
Recommended to you

Exit mobile version