మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే జంతర్ మంతర్ లో దీక్ష ఏర్పాట్లలో నిమగ్నమైన ఎమ్మెల్సీ కవితకు డిల్లీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. కవిత దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షను మరొక చోటికి మార్చుకోవాలని కవితకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కవిత మండిపడ్డారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎలా మార్చుకోమంటారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సిపిఐ నేత సీతారాం ఏచూరి ని కలవనున్నారు ఎమ్మెల్సీ కవిత. రేపు తాను చేపట్టే దీక్షను ప్రారంభించాల్సిందిగా కోరనున్నారు. మరోవైపు దీక్ష స్థలంపై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. అయితే జంతర్ మంతర్ వద్ద సగం స్థలమే కేటాయిస్తామని ఢిల్లీ పోలీసులు కవితకు సూచించారు.