BIG BREAKING : ఉమెన్స్‌ బాక్సింగ్‌ ఫైనల్‌లో నిఖత్‌ జరీన్‌ విజయం.. భారత్‌కు మరో స్వర్ణం

-

కామన్‌వెల్త్ క్రీడల్లో ఆదివారం భారత్‌కు పతకాల వర్షం కురుస్తోంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న విమెన్స్ బాక్సింగ్ ఫైనల్ పోరులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం సాధించింది. ఐర్లాండ్ బాక్సర్ కార్లి మెక్నాల్ తో తలపడిన నిఖత్ జరీన్‌ తన పంచ్‌తో మట్టికరిపించింది. దీంతో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. అయితే అంతకు ముందు.. కేరళకు చెందిన 25ఏళ్ల జంపర్ ఎల్దోస్ పాల్ మెన్స్ ట్రిపుల్ జంప్‌లో గోల్డ్ పతకం సాధించాడు. తద్వారా ఈ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

ఫైనల్లో భారత్ 1-2తో చారిత్రాత్మక విజయం సాధించడం మరింత ప్రత్యేకం. ఈ ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం గెలుచుకున్నాడు. వీరిద్దరు తమ భుజాలపై భారత జెండాను చుట్టుకొని అలెగ్జాండర్ స్టేడియం చుట్టూ రన్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇకపోతే గాయంతో వైదొలిగిన నీరజ్ చోప్రా స్థానంలో జావెలిన్ త్రో విభాగానికి బదులు ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డోస్ పాల్‌ను ఎంపిక చేసి బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ కు పంపించడం కలిసొచ్చింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గైర్హాజరీని ఎల్దోస్ పాల్ గోల్డ్ మెడల్ అందించి సఫలం చేసినట్లయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version