బుజ్జగింపులు నడవలే.. టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బై..బై..

-

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి రాజీనామా పర్వ కొనసాగుతోంది. అయితే.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌ను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాసకు రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు. వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రదీప్‌రావు భాజపాలో చేరడం ఖాయమని.. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో ఆయన చేరనున్నట్లు తెలిసింది.

పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డానని ప్రదీప్‌రావు తెలిపారు. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగానని, నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదని, మా కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదన్నారు ప్రదీప్‌రావు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారన్నారు ప్రదీప్‌రావు. పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టారని, ఆయన తిట్టినా టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ దాన్ని ఖండించలేదని ప్రదీప్‌రావు అన్నారు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తానని, లేదంటే స్వతంత్రంగా ఉంటానని స్పష్టం చేశారు ప్రదీప్‌రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version