సోషల్ మీడియాలో వార్తలు తొందరగా వైరల్ అవుతాయి అన్న విషయం తెలిసిందే..ఈ మధ్య ఇలాంటి వార్తలకు జనాలు తొందరగా ఆకర్షితులు అవుతున్నారు.. కొన్ని ఫేక్ న్యూస్ లు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి.తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. సోషల్ మీడియా యూజర్లు ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని తగలబెడుతున్న చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వ్యక్తిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, అరెస్టు చేయలేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు..
ఈ విషయంపై నిజ నిర్ధారణ సర్వేను నిర్వహించింది. ఇది ఇప్పటిది కాదని నిరూపించింది.జనవరి 31, 2016న అప్లోడ్ చేసిన ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనాన్ని కనుగొంది. త్రివర్ణ పతాకాన్ని తగులబెట్టిన బాలుడి చిత్రాలు వైరల్గా మారాయి అని అందులో ఉంది.
వైరల్ పోస్ట్లో కనిపించిన వ్యక్తి తమిళనాడులోని నాగపట్టినానికి చెందిన దిలీపన్ మహేంద్రన్. వైరల్ పోస్ట్ చూసిన ఓ పైలట్ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2016లో జరిగిన ఈ సంఘటనను నివేదించిన అనేక సంస్థల నివేదికలను కనుగొన్నాము. నివేదికల ప్రకారం, వైరల్ పోస్ట్లో చూసిన వ్యక్తి నివేదికల ప్రకారం భారత్ లోని చట్టాలపై కోపాన్ని ప్రదర్శించడానికి అలా చేసాడని తెలుస్తుంది.టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2, 2016న అందుకు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ యువకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..ఇలాంటి ఫేక్ వార్తలపై స్పందించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని కొందరు ప్రముఖులు హితవు పలుకుతున్నారు..2016లో తమిళనాడులోని నాగపట్నంలో ఈ ఘటన జరిగింది. భారత జాతీయ జెండాను దహనం చేసిన వ్యక్తిని 2016లో అరెస్టు చేశారు…ఇలాంటివి నమ్మి మోసపోవద్దని అధికారుల హెచరిస్తున్నారు..