సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో నిఖిల్.. ఏం సినిమా వర్కౌట్ అవట్లేదా..?

-

ఈమధ్య హీరోలు ప్రమోషన్స్ కోసం ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తున్నారని చెప్పవచ్చు. తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లక్షల ఖర్చు పెట్టి మరి ప్రమోషన్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రమోషన్స్ విషయంలో రాజమౌళిని ఇంకా ఎవరు రీచ్ అవ్వలేదని చెప్పాలి. కానీ ఈ క్రమంలోనే సరికొత్తగా ఆలోచించిన యంగ్ హీరోలు కూడా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా హీరో నిఖిల్ కూడా సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ ను కొనసాగించాడు. ఇక 2007లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఈయన కెరియర్ యు టర్న్ తీసుకుందని చెప్పాలి. ఈ సినీమాతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ ఒక మార్కెట్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం స్పై, 18 పేజెస్ తో పాటు కార్తికేయ 2 సినిమాలలో కూడా నటిస్తున్నాడు . ఇకపోతే ఉన్నట్టుండి ఒక సీరియల్ లోకి సడన్గా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్. సీరియల్లో పూర్తిస్థాయి రోల్ కోసం కాదు కానీ జీ తెలుగులో ప్రసారమవుతున్న మోస్ట్ పాపులర్ సీరియల్స్ లో ఒకటైన రాధమ్మ కూతురు సీరియల్లో అతిధి పాత్రలో కనిపించారు.

ఆపదలో ఉన్న ఒక మహిళను రక్షించి హీరో, హీరోయిన్ల బంధాన్ని నిలబెట్టే ఒక కీలక వ్యక్తిగా ఆయన మారిపోయారు. విలన్లతో ఫైట్ చేసి నిఖిల్ తన మాస్ ఎంట్రీ తో హీరో హీరోయిన్లను కలపడం సీరియల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే రాధమ్మ కూతురు ఎపిసోడ్ 842 కు సంబంధించిన ప్రోమో తాజాగా వైరల్ గా మారుతుంది. ఇందులో రాధమ్మ కూతురు లో నిఖిల్ అనుకోని ఎంట్రీతో సీరియల్ అభిమానులతో పాటు నిఖిల్ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. అయితే హీరో నిఖిల్ ప్రమోషన్స్ కోసం కాకపోయినా తన సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకులు తెలియజేయడానికి ఆయన ఇలా సీరియల్ లో ఎంట్రీ ఇచ్చారు అని పలు అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Radhamma Kuthuru | Premiere Ep 842 Preview - Jul 23 2022 | Before ZEE Telugu | Telugu TV Serial

Read more RELATED
Recommended to you

Exit mobile version