జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ, వార్డు వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకోచ్చారు.. అయితే గత రెండేళ్ళు ఉద్యోగుల జీతాలను పెంచకుండా, పర్మిట్ చెయ్యకుండా ప్రభుత్వం కాలం వెల్లబుచ్చింది..ఈ విషయం పై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు..దాంతో ప్రభుత్వం ఇటీవల జీతాలను పెంచింది..కాగా, ప్రొబేషన్ ఖరారైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు.. ఈ నెలకు సంబంధించి వచ్చే నెలలో అందుకోబోయే కొత్త జీతాలపై సందిగ్ధత ఏర్పడింది.ఆర్థిక శాఖను సంప్రదించి ఖాతాలు తెరిపించడంతోపాటు బడ్జెట్ కేటాయించేలా చూడాలని ఖజానా శాఖ సూచించింది.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు.. ఈ నెలకు సంబంధించి వచ్చే నెలలో అందుకోబోయే కొత్త జీతాలపై సందిగ్ధత ఏర్పడింది. 2022-23 బడ్జెట్ నుంచి ఆమెదం తీసుకోవటంతోపాటు.. కొత్త ఖాతాలు తెరవనందున పెరిగిన ఉద్యోగుల జీతాలతోపాటు ఇతర భత్యాల చెల్లింపు సాధ్యం కాదని రాష్ట్ర ఖజానాశాఖ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాయడం అనేక చర్చలకు దారి తీసింది.
ఈ పరిణామాలతో పెరిగే జీతాల కోసం ఆశగా నిరీక్షిస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన కొత్త వేతనంతోపాటు ఇతర భత్యాలు ఆగస్టు మొదటి వారంలోనే అందుతాయని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు.ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. 2022-23 బడ్జెట్‌లో సచివాలయాల ఉద్యోగులకు నెలకు 15వేల రూపాయల చొప్పున చెల్లించడానికే అనుమతి ఉంది..
పెరిగిన జీతాలతో పాటు,డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి భత్యాలు చెల్లించాలంటే మరోసారి బడ్జెట్ ఆమోదం తీసుకోవాలి. ఖాతాలు తెరవాలి. అప్పుడే సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ వెబ్‌సైట్‌లో డ్రాయింగ్, డిస్‌బర్స్‌మెంట్ అధికారి ఉద్యోగుల జీతాలు, ఇతర భత్యాలు అప్లోడ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే జీతాల బిల్లులను ఆన్‌లైన్ పోర్టల్ అనుమతించబోదు. సమస్య త్వరలోనే పరిష్కారమై వచ్చే నెలలో పెరిగిన కొత్త వేతనాలు ఉద్యోగులు అందుకునేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది…ఉద్యోగులు మాత్రం దీనిపై ఆందోళన చెందుతున్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పారా అని చెవులు కొరుక్కుంటున్నారు.. అధికారులు ఈ విషయం పై ఎప్పుడూ క్లారిటీ ఇస్తారో చూడాలి..