విడాకులపై అసలు విషయాన్నీ తెలిపిన నిఖిల్..!!

-

టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా సమయంలో తను ప్రేమించిన అమ్మాయి పల్లవిని వివాహం చేసుకున్నారు. అయితే వృత్తిరీత్యా డాక్టర్. అయితే అనూహ్యంగా నిఖిల్ విడాకులు తీసుకోబోతున్నారనే విషయం గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా 18 పేజీస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో ఈ విషయాన్ని కూడా తెలియజేసినట్లు సమాచారం. వాటి గురించి తెలుసుకుందాం.

నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ తన భార్య నుండి తాను విడిపోతున్నట్లు వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలియజేశారు ఆ వార్తలు చూసి స్టుపిడ్గా అనిపించిందని వాటిని చూసి తన భార్యతో తాను చాలా నవ్వుకున్నారని తెలియజేశారు. ముఖ్యంగా తామిద్దరం చాలా హ్యాపీగా ఉన్నామని ఇలా విడాకులు తీసుకుంటున్నామనే వార్తలు వస్తున్నాయని తన భార్యతో చెప్పకు ఆమె రియాక్షన్ చూసి తను షాక్ అయ్యానని తెలిపారు. మనం కలిసే ఉన్నాము అని వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఒక ఫోటో పెడదామా అని అడిగితే.. డ్యూడ్ ఏం చెబుతున్నావు.. మనం ఎలా ఉన్నామో మనకు తెలియదా..వాటికి ఎందుకు రియాక్ట్ అవ్వాలిని..తనకే ఎదురు చెప్పిందని తెలియజేశారు నిఖిల్.

ముఖ్యంగా ఇలాంటి రూమర్ చాలా ఫన్నీగా అనిపిస్తాయని తన అభిప్రాయంగా తెలియజేశారు. వాస్తవానికి ట్రోల్స్ ,మిమ్స్ చూసి తాము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటామని తెలిపారు.ఇలాంటి వార్తలు రాసే సమయంలో కాస్తా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలలో లోపల ఒకటి ఉంటే దాని థంబ్ నైల్ మరొకరకంగా పెడుతున్నారని తెలియజేశారు. లోపలికి వెళ్లి చూస్తే అందులో అసలు ఏమీ ఉండదని తెలిపారు. ప్రస్తుతం తన విడాకులపై ఇలా ఘాటుగా స్పందించారు నిఖిల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version