ఎలా అయినా ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీఎస్ నీలం సాహ్నీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జత చేసి నిమ్మగడ్డ పంపించారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని లేఖలో ఎస్ఈసీ ప్రస్తావించారు.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్టు లేఖలో మరోసారి స్పష్టం చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అయితే ఎన్నికలు నిర్వహిస్తానని, అందుకు అధికారులతో సమావేశం అవుతానని రెండు సార్లు ఆయన యత్నించగా రెండు సార్లు ఆయనకు ప్రభుత్వం నుండి సహాయ నిరాకరనే ఎదురయింది. అందుకే ఈసారి ఆయన లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లేఖకు వచ్చే సమాధానాన్ని బట్టి ఆయన ఏం చేస్తారో చూడాలి మరి.