ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. తనని పదవినుంచి ఉద్దేశపూర్వకంగా ఏపీ ప్రభుత్వం తొలగించిందని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. చట్టపరంగా తన తొలగింపు సరైనది కాదని రూల్ 2 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది. ఇదే సమయంలో 74 ఏళ్ల వ్యక్తి నీ ఎన్నికల కమిషనర్ గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్ లో తెలిపారు. దీంతో ముందు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ పని నడుస్తున్న మ్యాటర్ లోకి సడన్ గా నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ ఎంట్రీ ఇచ్చారు.
స్థానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదు లో ఒక్క శాతం కూడా లేవన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరిని సంప్రదించలేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రహస్యమని అన్న నిమ్మగడ్డ వాదన లో పస లేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నియమావళికి గవర్నర్ కి అన్ని అధికారాలు ఉన్నాయని అన్నారు. చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారు ఆయనని ప్రభుత్వం తొలగించ లేదని కనగరాజ్ తన పిటిషన్ లో చెప్పుకొచ్చారు. తాజా పరిస్థితుల వల్ల వివాదం మొత్తం నిమ్మగడ్డ వర్సెస్ కనగరాజ్ గా తయారు అవుతోంది.