టైర్ల కింద పడి 9 నెలల పసికందు మృతి…!

-

అక్బర్ హిల్స్ లో కారు వెనక టైర్ల కింద పడి 9 నెలల పసికందు మృతి చెందింది. వివరాలు చూస్తే.. కారు రివర్స్ తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారు కిందకు చిన్నారి పడిపోయింది. సెల్లార్ లో ఉంటున్న వాచ్ మెన్ ఫ్యామిలీ ఉంటోంది. వాళ్ళ పాప కి ఇలా జరిగింది.

ఓనర్ కారు తీస్తుండగా రివర్స్ తీసుకునే క్రమంలో ఆడుకుంటూ కారు కిందకి పాప వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. 20 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. ఆమే చనిపోవడంతో బోరున విలపిస్తున్నారు పేరెంట్స్. ఎన్నో పూజలు, నోములు చేసి గుళ్ళూ, గోపురాలు తిరిగితే పుట్టిన బిడ్డ అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version