తెలంగాణలో వరసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కాగా ఇటీవల మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఉమ్మడి వరంగల్ జిల్లాలను సందర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి పంటను పరిశీలించారు. ఈ పర్యటన మంత్రులతో ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే గండ్ర వెంకటరమణా రెడ్డి.. మంత్రి నిరంజన్ రెడ్డిలు ఒకే హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆ సమయంలోనే నిరంజన్ రెడ్డికి కరోనా సోకి ఉండవచ్చు.
థర్డ్ వేవ్ ప్రారంభం అయినప్పటి నుంచి వరసగా పలువురు రాజకీయ ప్రముఖులు, ఫిలింస్టార్లు వరసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు కరోనా సోకింది.