ఉద్యోగుల డిమాండ్‌పై మేమే నాలుగు మెట్లు దిగుతాం : సజ్జల

-

ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని.. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దమని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పారు. అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమని.. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని.. చర్చలకు కూర్చొకుండా షరతులు పెట్టడం సమంజసం కాదని చెప్పారు.

ఈ విధంగా వ్యవహరించడం సరి కాదని.. బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఉద్యోగులు మా ప్రత్యర్థులో.. శత్రువులో కాదు.. ప్రభుత్వంలో భాగమేనని.. అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామని చెప్పారు. పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందని.. సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తే అని తెలిపారు. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు. ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version