డిపాజిటర్ల కోసం కీలక బిల్లు ప్రవేశ పెట్టిన నిర్మలమ్మ… !

-

277 పట్టణ సహకార బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 105 సహకార బ్యాంకులు కనీస నియంత్రణ మూలధన అవసరాన్ని తీర్చలేకపోతున్నాయని ఆమె అన్నారు. 47 బ్యాంకుల నికర విలువ ప్రతికూలంగా ఉందని లోక్సభలో వివరించారు. 328 పట్టణ సహకార బ్యాంకులు 15% కంటే ఎక్కువ స్థూల ఎన్‌పిఎ నిష్పత్తిని కలిగి ఉన్నాయని నిర్మల వివరించారు.

సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ను సవరించడానికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “డిపాజిటర్లను రక్షించడానికి మేము ఈ సవరణను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. బ్యాంకుల్లో కొన్ని దురదృష్టకర పరిస్థితుల కారణంగా, డిపాజిటర్లను కష్టాల్లోకి నెట్టివేస్తారని ఆమె చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version