శభాష్‌.. పసిడిని ముద్దాడిన నీతూ ఘంఘాస్

-

ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం లభించింది. కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత నీతూ ఘంఘాస్ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లోనూ పసిడి పంచ్ విసిరింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. ఈ పోరులో నీతూ 5-0తో ప్రత్యర్థిని చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అగ్రశేణి బాక్సర్ మేరీకోమ్ కలను ఛిద్రం చేసిన బాక్సర్‌ను ఈ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్లో నిఖత్ జరీన్ ఓడించి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. నిఖత్‌తో పాటు, లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), నీతు ఘంఘాస్ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) కూడా ఫైనల్స్‌కు చేరి నాలుగు బంగారు పతకాలపై భారత్ ఆశలను పెంచారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు గెలిస్తే, అది అతని అత్యుత్తమ ప్రదర్శన అవుతుంది. కాగా, భారతీయ బాక్సింగ్‌ ముఖచిత్రాలుగా ఉన్న నిఖత్ జరీన్, నీతూ ఘంఘాస్‌లు ప్రస్తుతం భారత కీర్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు పోటీ పడనున్నారు. ప్రస్తుతం నిఖత్ 50 కేజీలు, నీతు 48 కేజీల కేటగిరీలలో పోరాడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version