పెళ్లి రూమర్స్​పై నిత్యా మీనన్ క్లారిటీ

-

మళయాల సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్​ హీరోతో నటి నిత్యా మీనన్ పెళ్లి జరగనుందనే వార్తలు పలు న్యూస్​ వెబ్​సైట్లలో, సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొట్టాయి. నెట్టింట ఈ టాపిక్ తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై నిత్య స్పందించారు. తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చారు.


“నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో నిజం లేదు. అదంతా కల్పితం” అని నటి నిత్యా మీనన్‌ స్పష్టం చేశారు. నేరుగా సోషల్​మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. వివాహం గురించి ప్రస్తుతానికి తనకెలాంటి ఆలోచన, ప్రణాళిక లేవని తెలిపారు. ఎవరో ఓ వ్యక్తి తాను ఊహించుకుని ఓ ఆర్టికల్‌ రాస్తే దాన్ని ఎలాంటి ఆధారాల్లేకుండా అంతా దాన్ని వ్యాప్తి చేశారన్నారు.


ఈ ఏడాది ‘భీమ్లా నాయక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నిత్య 19(1)(a) అనే సినిమాతో త్వరలోనే సందడి చేయనున్నారు. మరోవైపు, ‘తిరుచిత్రంబళం’ (తమిళం), ‘ఆరామ్‌ తురికల్పన’ (మలయాళం) తదితర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version