మీ పార్టీలో బీసీ నెతలెవరూ లేరా? ఎమ్మెల్సీ కవితకు బండ్రు శోభారాణి సూటి ప్రశ్న..

-

ఇటీవల తిహార్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్తగా బీసీ రాగం ఎంచుకున్నారు.జాగృతిని జాగరణ పరిచి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో కవిత బీసీల గురించి మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు. బీసీల గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేశారని, అయినా, బీసీల గురించి మాట్లాడడానికి మీ పార్టీలో బీసీ నేత ఎవరూ లేరా? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం బండ్రు శోభారాణి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version