Breaking : ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం షాక్.. డీఏలు కోత

-

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిస్తూ.. 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని, ఈ కారణంగా 18 నెలల డీఏ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. వాస్తవానికి 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏలు పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుదల ఉంటుంది. కరోనా సమయంలో డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెరగలేదు. మూడు సార్లు స్థిరంగానే కొనసాగింది. దీంతో గత మూడు డీఏలు (18 నెలల బకాయిలు) చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటు వేదికగా స్పష్టతనిచ్చింది. దీంతో తమకు బకాయి డీఏలు వస్తాయని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు పెద్ద షాక్ తగిలినట్లైంది. కేంద్రప్రభుత్వం 2021 జులైలో డియర్‌నెస్ అలవెన్స్‌ని తిరిగి ప్రారంభించింది. 1 జూలై 2021 నుండి కరువు భత్యాన్ని 11 శాతం పెంచింది. దీని తరువాత, జూలై 2021 నుండి డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతం నుండి 28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. 18 నెలల బకాయిల అంశంపై కేంద్రప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version