టెన్త్‌లో ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త.. ఆ ఫీజు మినహాయింపు

-

పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రావడంతో సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించనక్కర్లేదని, అందరికీ హాల్‌ టికెట్లు అందిస్తామని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 6 లక్షల 15 వేల 908 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 67.26 శాతంతో 4 లక్షల 14 వేల 281 మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.

దాదాపు 33 శాతం మందికిపైగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో.. వారందరికీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నెల రోజుల్లోనే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సప్లిమెంటరీలో పాసైన వారిని కూడా రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో సమానంగా గుర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయంగా తల్లిదండ్రులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version