సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు పథకం రెండవ విడత కార్యక్రమం ప్రారంభం కానున్న తరుణంలో వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కార్యక్రమం కొనసాగినన్ని రోజులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది వైద్యశాఖ. సంక్రాంతి పండుగ రోజు తప్ప మిగిలి అన్ని రోజులు వైద్య సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీచేసింది. సోమవారం కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైనా విధులకు హాజరు కాకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వైద్యశాఖ. కాగా ఈ కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version