విడాకుల సమయంలో భార్యకు భరణం ఇవ్వడం పై తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు అధిక ఆదాయం ఉంటే మరణం ఇవ్వాల్సిన పనిలేదని తాజాగా హైకోర్టు వెల్లడించింది. చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది మద్రాస్ హైకోర్టు.

భార్యకు నెలకు 30000 ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టి వేయడమే కాకుండా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆమెకు అధికంగా ఆస్తులు ఉండడమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా వస్తోందని ఈ సందర్భంగా తెలిపింది. అలాంటప్పుడు భరణం ఎందుకు ఇవ్వాలని కూడా ప్రశ్నించింది హైకోర్టు. ఆస్తులు అలాగే ఆదాయం లేకుంటే కచ్చితంగా భరణం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది.