వినాయక నిమజ్జనం సందర్భంగా 6వ తేదీన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. బాలాపూర్ వినాయకుడు చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్, సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు…. ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్‌బండ్ కు వెళతాయి. టోలిచౌకి, మెహిదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ కు చేరుకుంటాయి.

టప్పాచబుత్ర, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్‌లోకి మాత్రమే అనుమతి ఇస్తారు. దీంతోసౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్ గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు దారి మళ్లింపు.. పాట్నీ, పారడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లించనున్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్ట మైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. రద్దీ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్ , నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇస్తారు.