Breaking : ఇకపై మాస్క్‌లు లేకుంటే నో ఫైన్‌

-

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. అయితే కరోనా బారినపడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ముఖ్యంగా మాస్క్‌ పెట్టుకోవడం. అయితే.. తాజాగా.. ఇకపై దేశ రాజధాని ఢిల్లీలో మాస్క్‌ ధరించని వ్యక్తులకు ఎలాంటి జరిమాన విధించబోమని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడాన్ని కొనసాగించాలని ప్రజలను కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డీడీఎంఏ నిర్ణయించిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో సర్కారు కొవిడ్‌పై నిర్వహించిన గత సమీక్ష సమావేశంలో జరిమానాను ఎత్తివేసేందుకు నిర్ణయించిందని పేర్కొంది.

కొవిడ్‌ పాజిటివిటీ రేటు గణనీయంగా పడిపోయిందని, టీకాలు వేసినందున ఆదేశాలను ఉపసంహరించినట్లు వివరించింది. ముందుజాగ్రత్తగా భారీ జనసమూహంలో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించింది. కేసు కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ‘మాస్క్‌ తప్పనిసరి’ నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వెలుగు చూడగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సమీక్ష సమావేశం నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version