అఖండ విజయంతో జోరు మీదున్న నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఎన్బీకే 107 షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. గోపిచందర్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య 18 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దీని తర్వాత ఆయన అనిల్‌రావిపూడి దర్శత్వంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య తన రెమ్యూనరేషన్‌ను భారీగానే పెంచేశారట. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఖండతో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాలకృష్ణ.. రాబోయే తన రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ మాత్రం బాలకృష్ణ డిమాండ్ చేయాల్సిందే అని అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాలకు పైనే అవుతోంది. ఇప్పటి వరకు ఆయన కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేశారు. అయితే ఇప్పుడాయన తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ద్వారా బాలయ్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లోనూ రూపొందనుందని.. అలానే దీన్ని బాలీవుడ్లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం హిందీలో పేరున్న నటీనటులను తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నారట. కథానాయికను కూడా హిందీ నుంచి తీసుకు వస్తే ఎలా ఉంటుంది? అని అనుకుంటున్నారట! కాగా, మొదట ఈ చిత్రం కోసం అనిల్ రావిపూడి త్రిషను హీరోయిన్గా తీసుకుందామని భావించారట. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనిల్ బీటౌన్ భామలపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
కాగా ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి, ప్రియమణి కీలక పాత్రలను నటిస్తున్నారని.. అలానే యంగ్ బ్యూటీ శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.