సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు వద్దు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

-

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంత సీరియస్ గా దేనిమీద సుప్రీంకోర్టు మాట్లాడలేదు. కానీ మొదటిసారి కేంద్రంపై సీరియస్ అయింది. ఇంతకీ దేనిమీద అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా ఆగండి. ఇప్పుడు దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా చాలామంది సాయం కావాలని కోరుతున్నారు.

కొందరు వెంటిలేటర్ బెడ్ కావాలని, ఆక్సిజన్ కావాలని, అంబులెన్సు కావాలని, వ్యాక్సిన్ కావాలని.. ఇలా అనేక రకాల పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిపైన ఎలాంటి ఆంక్షలు విధించినా.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ప్రజల గళాలను అందరం కలిసి విందామని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

దేశంలో అందుతున్న వ్యాక్సిన్, ఆక్సిజన్, ఇతర సేవలపై ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం చేసిన విచారణలో ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి చంద్రచూడ్ మాట్లాడుతూ.. తాను ఓ పౌరుడిగా అడుగుతున్నానని.. దేశంలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని ఆర్డర్ వేశారు. వ్యాక్సిన్లను కేంద్రమే రాష్ట్రాలకు సమాన ధరలో పూర్తిగా అందించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version