మూడో వేవ్ కి రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రెండు కంటే ఇదే భయంకరం అంటున్న నిపుణులు

-

దేశంలో ఇప్పుడు కరోనా రెండో వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనా తీవ్రతను కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రకు కరోనా రెండో వేవ్ దాటి మూడో వేవ్ లోకి వెళ్ళింది పరిస్థితి. వచ్చే రెండు నెలల్లో మహారాష్ట్రకు ఉధ్ధృతంగా థర్డ్‌ వేవ్‌ ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు పంపించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి మే చివరినాటికి గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. జులై-ఆగస్టు మధ్య థర్డ్‌వేవ్‌ విజృంభించే ప్రమాదం వుందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌తోపే ప్రకటన చేసారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజూ 60వేల పాజిటివ్‌ కేసులు, 800 మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version