రేషన్ షాపుల వద్ద సన్నబియ్యం నో స్టాక్ బోర్డులు..

-

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సన్న బియ్యం పంపిణీ చేస్తే పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావించింది.

ఇదిలాఉండగా, బియ్యం పంపిణీ ప్రారంభమై మూడు రోజులు అవుతుండగా.. ఇంతలోనే పలు చోట్ల సన్నబియ్యం పంపిణీలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని రేషన్ దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఇదేంటని ప్రశ్నించగా..మళ్లీ స్టాక్ తెప్పిస్తామంటూ షాపుల నిర్వాహకులు, అధికారులు బదులిస్తున్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news