బీహార్ ఎలక్షన్స్: ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేం.. ఎల్జేపీకి కౌంటర్ ఇచ్చిన బీజేపీ..

-

బీహార్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ పొత్తుల వ్యవహారం చర్చకి వచ్చిన సంగతి తెలిసిందే. లోక్ జన్ శక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్, బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులపై, ప్రధాన మంత్రి మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఎలాగైనా బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా పొగడ్తల కార్యక్రమం మెదలెట్టాడు. ఐతే తాజా సమాచారం ప్రకారం బీజేపీ, ఎల్జేపీ తో పొత్తు పెట్టుకోకూడని అనుకుంటుందట.

లోక్ జన్ శక్తి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓట్లు చీలిపోతాయని, అందుకే చిరాగ్ పాశ్వాన్ పొత్తుకు సుముఖత చూపించినప్పటికీ బీజేపీ వర్గాలు వద్దని కోరుకుంటున్నాయి. మరి బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, మోడీకి ఉన్న పాపులారిటీతో ఎన్నికల్లోకి వెళ్దామని అనుకున్న చిరాగ్ పాశ్వాన్ కి ఆదిలోనే దెబ్బ పడింది. మరి ఈ టైమ్ లో చిరాగ్ పాశ్వాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version