ఎమ్మెల్సీతో నో యూజ్..హుజూరాబాద్‌కు కౌశిక్ ఫిక్స్..సీటే డౌట్..!

-

హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో సంచలనమైన పాడి కౌశిక్ రెడ్డి..రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేయాలని చూస్తున్నారు..ప్రజలు తనని మర్చిపోకూడదని ఎప్పుడు ఏదొరకంగా మీడియాలో కనిపిస్తున్నారు. ఎక్కువగా ఈటల రాజేందర్‌పై విమర్శలు చేస్తూ హైలైట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో సంతృప్తిగా లేదని, అదే ఎమ్మెల్యే పదవి ఉంటే ఏదో చేసే వాడిని అని హుజూరాబాద్ ప్రజలకు చెబుతున్నారు.

ఎలాగో హుజూరాబాద్ సీటు కేసీఆర్ తనకు ఫిక్స్ చేశారని, మీకు దండం పెడతా వచ్చే ఎన్నికల్లో తనని గెలిపించాలని కౌశిక్..అక్కడి ప్రజలని కోరుతున్నారు. “ఈ సారి నాకు ఓటేయండి. గెలిపించండి. హుజూరాబాద్‌ని హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతా. నన్ను నమ్మండి. కేసీఆర్ గారిని గెలిపించినట్టుగా భావించి నన్ను గెలిపించండి” అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో హుజూరాబాద్ సీటు తనదే అని కౌశిక్ ఫిక్స్ అయ్యారు.

2018 ఎన్నికల్లో కౌశిక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఈటలపై ఓడిపోయారు. ఆ తర్వాత ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి టీఆర్ఎస్‌లో చేరి సీటు ఆశించారు. కానీ కేసీఆర్ మాత్రం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సీటు ఇచ్చింది. అయినా సరే ఈటలకు చెక్ పెట్టలేకపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ తనకే అని కౌశిక్ ప్రచారం చేస్తున్నారు..నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

అసలు గెలుపు సంగతి పక్కన పెడితే…సీటు దక్కడమే డౌట్ గా ఉంది. కౌశిక్‌కు సీటు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. అక్కడ గెల్లుతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఉన్నారు. ఈ సారి పొత్తులో భాగంగా హుస్నాబాద్ సీటు కమ్యూనిస్టులకు ఇస్తే..సతీశ్‌ని హుజూరాబాద్ తీసుకు రావచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఎలాగో హుజూరాబాద్ సతీశ్ సొంత స్థానం. అటు గెల్లు కూడా ఉన్నారు. దీంతో కౌశిక్ సీటు గ్యారెంటీ లేదు. ఈటల ఉన్నంత కాలం గెలుపు డౌటే.

Read more RELATED
Recommended to you

Exit mobile version