రూ.3,999కే నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ నావ్ స్మార్ట్‌వాచ్

-

వియ‌ర‌బుల్స్ త‌యారీదారు నాయిస్ భార‌త్‌లో నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ నావ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 1.4 ఇంచుల క‌ల‌ర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 320×320 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. బ్లూటూత్ 4.2 ద్వారా ఇది ఫోన్ల‌కు క‌నెక్ట్ అవుతుంది. వాచ్ ఫేస్‌ల‌ను ఇందులో క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు. 10 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు.

ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్ ఫీచ‌ర్ ఈ వాచ్‌కు ఉంది. 24 * 7 హార్ట్ రేట్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల నిరంత‌రాయంగా హార్ట్ రేట్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఫోన్‌కు వ‌చ్చే కాల్స్‌, టెక్ట్స్, యాప్, సోష‌ల్ మీడియా, ఇత‌ర అల‌ర్ట్స్‌ను వాచ్‌పై చూసుకోవ‌చ్చు. ఈ వాచ్‌లో 180 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఇది 4 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇస్తుంది.

రూ.3,999 ధ‌ర‌కు ఈ వాచ్‌ను వినియోగ‌దారులు అమెజాన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version