కరోనా వైరస్ సోకిన రోగుల విషయంలో కొందరు అనుసరిస్తున్న వైఖరిపి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనా రోగులు ఎవరు అయినా ప్రాణాలు కోల్పోతే వారి అంత్యక్రియల విషయంలో నిజంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జేసీబీ లతో కరోనా మృతదేహాలను తరలిస్తున్న ఘటనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
వాజేడు మండలం గుమ్మిడిదొడ్డిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ప్రసాద్ మృతదేహాన్ని ఖననం చేసేందుకు జేసీబీతో తరలించడం సంచలనంగా మారింది. పీపీఈ కిట్లు ఉన్నా మృతదేహాన్ని తరలించేందుకు పంచాయతీ సిబ్బంది ముందుకు రాలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక అడిగినట్టు తెలుస్తుంది. అక్కడి స్థానికులు కూడా ఈ ఘటనను చూసి కంగారు పడ్డారు. ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా సరే ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు.